గుంటూరు వెస్ట్ (క్రీడలు): పికిల్ బాల్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన గోరంటల్లోని నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో గుంటూరు ఓపెన్ ఉమెన్ పికిల్ బాల్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తామని జిల్లా పికిల్ బాల్ సంఘం సంయుక్త కార్యదర్శి కె.అరుణ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను స్కూల్ ఆవరణలో వైజయంతి డెంటల్ కేర్ అధినేత డాక్టర్ వైజయంతి, శశిధర్, నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత కె.శ్రీకాంత్ బాబు, కె.శ్రీవిద్య, జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్‌లు ఆవిష్కరించారన్నారు. మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో అండర్–15 బాలికలు, ఓపెన్ కేటగిరి, సింగిల్స్, ఓపెన్ డబుల్ ఈవెంట్లు జరుగుతాయన్నారు. ఎస్‌కే మన్సూర్ వలి, ఆనంద్ కుమార్, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జి.జె.కిషోర్ పాల్గొన్నారన్నారు.
8న ఉమెన్ పికిల్ బాల్ పోటీలు
Mar 3 2026 8:15 AM | Updated on Mar 3 2026 8:15 AM
8న ఉమెన్ పికిల్ బాల్ పోటీలు లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు చినగంజాం: భర్త ఇంట్లోలేని సమయంలో మహిళపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శీలం రమేష్ సోమవారం తెలిపారు. వివరాలు.. మండలంలోని పెదగంజాం పంచాయతీ ఆవులదొడ్డి కొత్తగొల్లపాలెం గ్రామానికి చెందిన యల్లావుల రవి అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ భర్త ఇంటిలో లేని సమయంలో వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించగా ఆ మహిళ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement


