హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేసిన గురజాల పోలీసులు
●నడిరోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు..
●విస్మయం వ్యక్తం చేస్తున్న పరిశీలకులు
సాక్షి నరసరావుపేట: హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గురజాల పోలీసులు బేఖాతరు చేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... గురజాల మండలంలోని తేలుకుట్ల గ్రామానికి చెందిన ఒక పార్టీ నాయకుడిపై కొంతమంది దాడి చేసిన సంఘటనలో గురజాల పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వారిని ఆదివారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించి వారిని పోలీసులు రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు హాజరుపరిచారు. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్న వారిని పోలీసులు రోడ్డుపై నడిపించకూడదనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గురజాల పోలీసులు నిందితులను రోడ్డుపై నడిపించి తీసుకువెళ్లడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకులకు ఒక న్యాయం మరొకరికి ఒక న్యాయమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు రాజకీయ ప్రముఖులువారి ఆభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు.


