వినుకొండలో మహిళల ఆందోళన
పాఠశాల, నివాసాల
మధ్య మద్యం షాపు వద్దంటూ నిరసన
వినుకొండ: నివాస గృహాలు, పాఠశాలల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దన్న నిబంధనలను తుంగలో తొక్కి అకస్మాత్తుగా బ్రాందీ షాపు ఏర్పాటుచేయడంపై మహిళలు తిరుగుబాటు చేశారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్ ప్రాంతంలో ఒక వైపు ఎస్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, మరో వైపు నివాస గృహాలు ఉన్నాయి. శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడంతో స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మహిళల ఆందోళనకు సీపీఐ నాయకులు మద్దతు ప్రకటించారు. పోలీస్, ఎకై ్సజ్ అధికారులు వచ్చి ఉన్నతాధికారులతో మాట్లాడి షాపును తొలగిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి 2,618 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల బ్యాంక్ కెనాల్‌కు 244, తూర్పు కాలువకు 330, పశ్చిమ కాలువకు 120, నిజాంపట్నం కాలువకు 50, కొమ్మూరు కాలువకు 1,446 క్యూసెక్కులు బ్యారేజి నుంచి విడుదల చేశారు.
వినుకొండలో మహిళల ఆందోళన


