ప్రకృతి వ్యవసాయానికి విదేశీ ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయానికి విదేశీ ప్రశంసలు

Feb 28 2026 7:15 AM | Updated on Feb 28 2026 7:15 AM

ప్రకృతి వ్యవసాయానికి విదేశీ ప్రశంసలు

ప్రకృతి వ్యవసాయానికి విదేశీ ప్రశంసలు

పెదకూరపాడు: పల్నాడు జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు విదేశీ ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. నెదర్లాండ్‌కు చెందిన గ్లోబల్‌ మార్కెటింగ్‌ బృందం పెదకూరపాడు గ్రామంలో ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న రైతు దర్శి శేషారావు మిరప పొలాన్ని సందర్శించింది. జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ కె.అమలకుమారి పర్యవేక్షణలో జరిగిన ఈ సందర్శనలో రసాయనాలు వినియోగించకుండా కషాయాలు, జీవామృతంతో పంటలను సాగు చేస్తున్న విధానాన్ని బృందం పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్‌లో మిరప ప్రధాన వాణిజ్య పంట అని, ప్రకృతి విధానంలో పండించడం అభినందనీయమని సభ్యులు పేర్కొన్నారు. ప్రధాన పంటతోపాటు ముల్లంగి, ఉల్లి, బీట్రూట్‌, క్యారెట్‌, టమోటా, మొక్కజొన్న, కంద, బంతి వంటి అంతర పంటలు, జొన్న, సజ్జలను రక్షక పంటలుగా సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తున్నట్లు వివరించారు. ప్రకతి పద్ధతిలో పండించిన ఉత్పత్తులకు మార్కెట్‌ ధర కంటే మెరుగైన ధర వస్తోందని తెలిపారు. 2025–26 సంవత్సరంలో జిల్లాలో 1,04,586 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రాజెక్టు మేనేజర్‌ అమలకుమారి తెలిపారు. మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య మాట్లాడుతూ 12 మే 2025న 30 రకాల విత్తనాలతో పచ్చిరొట్ట పైర్లు వేసినట్లు తెలిపారు. దీంతో భూమిలో సేంద్రియ కార్బన్‌ శాతం పెరిగి సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది ప్రధాన పంటకు అవసరమైన పోషకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. మిరప కలాలను పరిశీలించి శాసీ్త్రయ పద్ధతిలో ఆరబెట్టే విధానంపై సూచనలు ఇచ్చారు. నెదర్లాండ్‌ గ్లోబల్‌ మార్కెటింగ్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌ లియో, సంబల్‌ ప్రాజెక్టు స్టేట్‌ లీడ్‌ వినూత్న, ఎన్‌ ఎఫ్‌ఏ మార్కెటింగ్‌ ఎస్‌పీఎంయూ పున్నారావు, ఏఈఓ జానీబాషా, మార్కెటింగ్‌ బృందం సభ్యులు మేరీ, అంజలి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement