రైల్వేలైన్లపై ఆర్‌ఓబీ, ఆర్‌యూబీలను పూర్తి చేయండి
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: జిల్లాలో రైల్వేలైన్ల వద్ద ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు మంజూరైన 20 ఆర్‌ఓబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి), ఆర్‌యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి)ల నిర్మాణాలు ప్రారంభించి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్‌యూబీ, ఆర్‌ఓబీ నిర్మాణాలపై అధికారులతో సమీక్షించారు. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తున్న భూమిలో ఎర్రుపా లెం–అమరావతి–నంబూరు రైల్వేలైన్‌పై ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ నిర్మిస్తామన్నారు. మిగిలిన ప్రాంతాల్లో రైతులకు పరిహారం అందించే ప్రక్రి య పూర్తిచేయాలని రెవెన్యూ అధికారుల ను ఆదేశించారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పలుచోట్ల పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదన్నారు. డీఆర్‌ఓ ఏకా మురళి, ఆర్‌డీఓలు మురళీకృష్ణ, రమణాకాంతరెడ్డి పాల్గొన్నారు.
టెన్త్‌లో నూరు శాతం
ఫలితాలు సాధించాలి
డీఈఓ రామారావు
నరసరావుపేట ఈస్ట్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు సమష్టిగా కృషి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. శంకరభారతిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభు త్వం రూపొందించిన 100 రోజుల ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. వెనుకబడిన విద్యార్థులపై సబ్జెక్ట్ ఉపాధ్యా యులు ప్రత్యేక దృష్టి సారించి వారిలో సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. పది ఫలితాలలో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలని కోరారు. యూడైస్ నమోదు పూర్తి చేయాలన్నారు. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు రూపొందించిన జీఎఫ్‌ఎల్‌ఎన్‌ను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ఎంఈఓలు పాల్గొన్నారు.


