ముదిరాజ్‌ల హక్కుల కోసం పోరాటం
మాచర్ల రూరల్: ఆర్థికంగా, సామాజిక పరంగా రాజకీయంగా వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్న ముదిరాజులు ఐక్యంగా నిలబడి హక్కులు సాధించుకుందామని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్‌రావు ముదిరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 23 లక్షలకు పైగా జనాభా కలిగిన ముదిరాజ్‌లకు ఏ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వటం లేదని, రేపటి తరం కోసం నేటి ప్రయత్నంలో భాగంగా ముదిరాజులందరినీ ఐక్యపర్చేందుకు ఈ నెల 4వ తేదీన గుంటూరులో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ముదిరాజ్‌ల రాజకీయ ప్రస్థానం, జాతి అభివృద్ధి కోసం విద్యావేత్తలు, మేధావులు, యువత, విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి నుంచి ఉద్యమ బాటలకు నడుం కట్టనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నేతలు పెద్ద ఎత్తున రానున్నట్లు ఆయన చెప్పారు. జనాభా దామాషా ప్రకారం ముదిరాజ్‌లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగు ప్రాధాన్యత కల్పించేందుకు ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్ వెంటనే ప్రకటించాలని, రానున్న ఎంఎల్‌సీ ఎన్నికలలో అవకాశం కల్పించాలనే డిమాండ్లతో ముదిరాజ్ మహాసభ ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగనబోయిన సాంబశివరావు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి వల్లెబోయిన రాజ్ ముదిరాజ్ పాల్గొన్నారు.
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్‌రావు ముదిరాజ్


