జాతీయ కబడ్డీ ప్రాబబుల్స్‌కు నలుగురు ఎంపిక
చినగంజాం: జాతీయ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలకు జిల్లా జట్టు నుంచి నలుగురు క్రీడాకారులు ఆంధ్ర రాష్ట్ర ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికయినట్లు జిల్లా జట్టు కెప్టెన్ హరిప్రసాద రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లా జట్టులో కుంచాల శ్రీకాంత్ రెడ్డి, గాలి లక్ష్మణ్‌రెడ్డి, కోట హరిప్రసాద్ రెడ్డి, పి.బ్రహ్మారెడ్డి ఎంపికయ్యారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద నిర్వహించిన సీనియర్ పురుషుల కబడ్డీ జిల్లా స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించగా ఆ పోటీల్లో పొల్గొని ప్రతిభ కనబరచిన వీరిని జాతీయ పోటీలకు ఆంధ్ర కబడ్డీ జట్టులో ప్రాబబుల్స్ జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న వీరికి జనవరి 15 వ తేదీ నుంచి విజయవాడలో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. శిక్షణ అనంతరం వీరు జాతీయ స్థాయిలో గుజరాత్‌లోని వడోదరలో ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహించనున్న 72వ జాతీయ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనున్నట్లు తెలిపారు.
బ్రహ్మారెడ్డి
కోట హరిప్రసాదరెడ్డి
కుంచాల శ్రీకాంత్ రెడ్డి
గాలి లక్ష్మణ్ రెడ్డి
జాతీయ కబడ్డీ ప్రాబబుల్స్‌కు నలుగురు ఎంపిక
జాతీయ కబడ్డీ ప్రాబబుల్స్‌కు నలుగురు ఎంపిక
జాతీయ కబడ్డీ ప్రాబబుల్స్‌కు నలుగురు ఎంపిక


