సబ్ జూనియర్ రగ్బీ పోటీల్లో బంగారుపతకం
తాడేపల్లి రూరల్ : రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ రగ్బీ పోటీల్లో గుంటూరు జిల్లా తరఫున మంగళగిరి, కుంచనపల్లి అరవింద స్కూల్ విద్యార్థులు పాల్గొని ఘనవిజయం సాధించి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లా కార్యదర్శి దత్తారావు మాట్లాడుతూ కర్నూలు జిల్లా, ఆదర్శ విద్యామందిరంలో నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ రగ్బీ చాంపియన్ షిప్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల నుంచి జట్లు పాల్గొనగా అరవింద స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఇంద్రాణి, సాయి అరవింద్‌లు విద్యార్థులను అభినందించారు.


