ఆన్‌లైన్‌లో ఎక్కించండి
నాకు పూర్వీకుల నుంచి సక్రమించిన 1.90 ఎకరాల పొలం ఉంది. అన్ని పత్రాలు ఉన్నాయి. భూమి నా ఆధీనంలోనే ఉంది. ఆర్థిక ఇబ్బందులతో నా వియ్యంకుడు అల్లం శ్రీనివాసరావుకు 2016లో విక్రయించా. ఆన్‌లైన్‌లో పొలం బత్తుల శ్రీలక్ష్మి, కరిముల్లారావుచౌదరి పేర్లపై ఉంది. తహసీల్దార్‌ను పలుమార్లు కలసి ఆన్‌లైన్‌లో పొలం ఎక్కించాలని అర్జీ పెట్టుకున్నా. గ్రీవెన్స్‌లో కూడా అర్జీపెట్టా. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఆ పొలం అమ్మితేనే నా ఆర్థిక బాధలు తీరతాయి. లేకపోతే నాకు చావే గతి, దయచేసి పొలం ఆన్‌లైన్‌లో ఎక్కించండి.
–జంగం నల్లకోటయ్య, రాజుపాలెం


