
ముగిసిన జిల్లా ఫెన్సింగ్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఉమ్మడి గుంటూరు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బీఆర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–17 బాలబాలికల పోటీలు ముగిశాయి. జిల్లా కార్యదర్శి డి.అశోక్ బాబు మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభకనబరచిన వారిని ఈ నెల 30న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరగనున్న అంతర్ జిల్లాల పోటీలకు పంపిస్తామని తెలిపారు. పోటీలను ఖేలో ఇండియా కోచ్ చిరంజీవి, డీఎస్‌ఏ కోచ్ కె.సంగీత బాబు ఆధ్వర్యంలో నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ చైర్మన్ డి.ఎస్. క్రిష్టోఫర్, కోచ్‌లు పాల్గొన్నారు.