
కేఎల్‌యూ డైరెక్టర్‌కు జాతీయ పురస్కారం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్) డైరెక్టర్ పిసిని సాయి విజయ్ శుక్రవారం జాతీయ పురస్కారం అందుకున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ జి. పార్థసారథి వర్మ తెలిపారు. హైదరాబాద్‌లోని నియో కన్వెన్షన్‌లో ఈకే ఉపదేశ మీడియా ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ అవార్డ్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ అవార్డు సాయి విజయ్‌కు లభించిందని పేర్కొన్నారు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా అనేక నామినేషన్లు అందినప్పటికీ సాయి విజయ్ ఎంపిక కావడం అభినందనీయమని తెలిపారు. ఆయన్ను వర్సిటీ ప్రో వీసీలు డాక్టర్ ఎన్. వెంకట్రామ్, డాక్టర్ కె. రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ డాక్టర్ కేఆర్‌ఎస్ ప్రసాద్ అభినందించారు.