
ఓట్ల తొలగింపు అన్యాయం
దాచేపల్లి : త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో కూటమి అభ్యర్థి గెలుపు కోసమే వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని మూడో వార్డుకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. గత ఓటరు జాబితాలో 1,596 ఓట్లు ఉన్నాయి. తాజాగా అధికారులు తయారు చేసిన జాబితాలో 1,112 ఓట్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా వెలువరించిన జాబితాలో 484 ఓట్లు మాయం అయ్యాయి. వీటిల్లో అత్యధికంగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లే ఉన్నాయి. విషయం తెలుసుకున్న నేతలు గురువారం నగర పంచాయతీ కమిషనర్ జి. వెంకటేశ్వర్లు కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 3వ వార్డులో తమ పార్టీకి చెందిన సానుభూతిపరుల ఓట్లు 484 మాయం చేశారని, కూటమి అభ్యర్థిని గెలిపించడం కోసమే అధికారులు కుమ్మకై ్క ఈ కుట్ర చేశారని ఆరోపించారు. కమిషనర్ దీనిపై సమగ్ర విచారణ చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని నేతలు చెప్పారు. వినతి పత్రం అందించిన వారిలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు షేక్ సుభాని, కోట కృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జాకీర్ హుస్సేన్, కౌన్సిలర్లు చాట్ల క్రాంతికుమార్, నగుబండి గురువులు, ఈదా వెంకటరెడ్డి, దేవళ్ల రఘు, నాయకులు కొప్పుల కృష్ణ, కుందూరు తిరుపతిరెడ్డి, కోలా జంపాల రెడ్డి, కోలా శ్రీనివాస్ రెడ్డి, షేక్ సైసావల్లి, డాడీ, కోలా నరసింహారెడ్డి, పాపా ఉన్నారు.
● వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపు
● వైఎస్సార్ సీపీ నేతల న్యాయ పోరాటం