
అధికారుల కుమ్మక్కు
రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఆక్రమించుకున్న అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ శాఖ నిషేధిత జాబితాలో ఉంది. దీంతో సదరు సంస్థ సర్వే నంబరు మార్చి దర్జాగా ప్లాట్లను విక్రయించింది. ఇందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సహకరించారు. అసైన్డ్ భూమి ఆక్రమణలో గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన వ్యక్తి కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది. ఆయన ఆశీస్సులతోనే ఈ వ్యవహరాన్ని నిశ్చింతంగా పూర్తి చేశారని సమాచారం. ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందాయి. వరద కాలువను ఆక్రమించి ప్లాట్లు వేసి, వాటిని బహిరంగ మార్కెట్లో సెంటు రూ.3లక్షల వరకు సంస్థ అమ్మేసింది.