
ఈమె అనర్హురాలట...
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు పచ్చవ వీరమ్మ, నాదెండ్ల. అవివాహితురాలు, వయసు 55 ఏళ్లు. పుట్టుకతోనే శారీరక, మానసికంగా వైకల్యం ఉంది. దశాబ్దాల కాలంగా ప్రభుత్వం నుంచి వికలాంగ పింఛన్ తీసుకొని జీవనం సాగిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వంలో వెరిఫికేషన్ పేరిట ఈమె పింఛన్‌కు అనర్హురాలని నోటీసులు అందించి తొలగిస్తున్నామని తెలిపారు. కావాలంటే మరోసారి దరఖాస్తు చేసుకోమని సూచించారు. అన్ని సరిగా ఉన్నవారే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేరు. మరి ఇలాంటి స్థితిలో ఉన్న మహిళ మళ్లీ పింఛన్ తెచ్చుకోవడం ఎలా? ఇలాంటి ఉదాహరణలు జిల్లాలో కోకొల్లలు.