వినుకొండ రూరల్ మండలం అందుగుల కొత్తపాలెంలో జగనన్న కాలనీని ఆక్రమించి బత్తాయి, కొబ్బరి మొక్కలు సాగు చేస్తున్న అక్రమార్కులు
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
వినుకొండ: కూటమి ప్రభుత్వంలోకి జగనన్న కాలనీ స్థలాలకు రక్షణ లేకుండా పోయాయి. అక్రమార్కులు యథేచ్ఛగా ఎకరాలకు ఎకరాలు ఆక్రమిస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు మిన్నుకుంటుండడంతో వారు చెలరేగిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. వినుకొండ రూరల్ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామంలోని సర్వే నం.194–3లో 1.80 ఎకరాలు ప్రభుత్వ భూమిని జగనన్న కాలనీ కోసం అప్పట్లో రెవెన్యూ అధికారులు సేకరించి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో బాగు చేశారు. అదే గ్రామానికి చెందిన పిడిరిడి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని కలుపుకొని ఉండటంతో అధికారులు అతనివద్ద నుంచి ప్రభుత్వ భూమిని విడగొట్టి జగనన్న కాలనీని ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో సదరు వ్యక్తి మళ్లీ జగనన్న కాలనీకి ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించి ఏకంగా కొబ్బరి, బత్తాయి మొక్కల సాగు చేపట్టాడు.
నా భార్య మల్లీశ్వ రి పేరుతో జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. అయితే స్థలాల్లో ఇళ్ల నిర్మా ణాలు చేపట్టేందుకు జాప్యం కావడం, ఇంతలోనే ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఆ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించి ఏకంగా బత్తాయి, కొబ్బరి మొక్కలు సాగు చేస్తున్నాడు. అధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలి.
– మిరియాల కోటయ్య, అందుగుల కొత్తపాలెం
పేదల స్థలంలో పండ్ల తోట