
బాపట్లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు
బాపట్ల అర్బన్: వర్షాలు, వరదలు దృష్ట్యా పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి తెలిపారు. పట్టణంలోని పలు డ్రెయినేజీలు, నీటి కుంటలలో దోమలు ఉత్పత్తి జరగకుండా గంబూషియా చేప పిల్లలను సోమవారం వదిలే కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఖాళీలను యజమానులు శుభ్రం చేయించుకోవాలని, పిచ్చిమొక్కలు, అపరిశుభ్రంగా ఉంటే సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. పురప్రజలు కూడా మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సీహెచ్ కరుణ, నజీర్ ఉన్నారు.