
గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి
వినుకొండ: గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్‌తో అ సెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. వినుకొండ జాషువా కళా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి, గిరిజన హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అధ్యక్షతన వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజనులు కనీసం కూడు, గూడు, నీడ లేక పరితపిస్తున్నారని తెలి పారు. ఇప్పటికీ రేషన్, ఆధార్ కార్డులు లేక దుర్భర మైన జీవితాలు గడుపుతున్నారని పేర్కొన్నారు. నేటికి ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ ఫలాలకు దూరం అవుతున్నారని చెప్పారు. గిరిజనుల అభ్యున్నతికి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయలు నిధులు దారి మళ్లించకుండా ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, బీఎస్పీ కార్యదర్శి రాజు, పల్నాడు జిల్లా యువజన నాయకుడు జరపల కృష్ణా నాయక్, యువజన అధ్యక్షుడు హనుమంతు నాయక్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు రంగ నాయక్, గౌరవ అధ్యక్షుడు విష్ణు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నేత బాలాజీ నాయక్, డాక్టర్ కోటేశ్వరరావు నాయక్, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్, మాచర్ల జెడ్పీటీసీ సభ్యుడు మల్లు సామి, రేమిడిచర్ల సర్పంచ్ బ్రహ్మం, రాంజీ నాయక్, వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో
గిరిజన సంఘాల నేతలు తీర్మానం
మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందని..