
25న కలెక్టరేట్ వద్ద కౌలు రైతు సంఘం ధర్నా
నరసరావుపేట రూరల్: కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న ‘చలో కలెక్టరేట్’ నిర్వహిస్తున్నట్టు ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ తెలిపారు. కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ మండలలలోని కేసానుపల్లి, చిన్నతురకపాలెం, చింతలపాలెం, గోనెపూడి, గురవాయపాలెం, అర్వపల్లి, ఉప్ప లపాడు తదతర గ్రామాల్లో ఆదివారం ప్రచారం నిర్వహించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డు మంజూరు చేయాలని కోరారు. స్కేల్ ఆఫ్ ఫైన్సాన్స్ ప్రకారం రూ.2లక్షల వరకు ఎటువంటి హామీ లేని పంట రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల కోసం ప్రత్యేక రాయితీలు, పంట రుణాలు అంటూ ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవడమే తప్పా అమ లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమ ర్శించారు. కౌలు రైతు గుర్తింపు కార్డుల వల్ల ఆశించిన మేర ప్రయోజనం దక్కడం లేదని తెలిపారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కౌలు రైతులను గుర్తించి ఉచితంగా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసి ఆదుకోవాలని ఆయన కోరారు. పల్నాడు జిల్లాలో 60శ ాతం కౌలు రైతులే పంటల సాగు చేస్తున్నారని తెలి పారు. జిల్లాలో 1.50లక్షలు కౌలు రైతులు ఉంటే 65 వేల మందికే గుర్తింపు కార్డులను లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించడం బాధాకరమని తెలిపారు. కార్డులు లేని వారు ప్రభుత్వ పథకాలు అందక ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, ప్రజానాట్యమండలి కార్యదర్శి టి.పెద్దిరాజు పాల్గొన్నారు.