6 నుంచి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్
నరసరావుపేట: ఈనెల ఆరవ తేదీ నుంచి 14 వరకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి డ్రెయిన్లను శుభ్రం చేయాలని, అలానే నాల్గవ తేదీ నుంచి ఐదు వరకు ట్యాంకులు శుభ్రపర్చటం, క్లోరినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వర్షాకాలం రానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ వెక్టార్, హైజీన్ యాప్‌లో వివరాలు త్వరితగతిన అప్‌లోడ్ చేయాలన్నారు. గార్బేజ్ సేకరణ ప్రతిరోజు చేపట్టాలన్నారు. మండల పరిషత్ అధికారులు తరచుగా సిబ్బందితో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యంలో అనుమానం ఉన్నవారు పరీక్షలు చేయించుకొని తగు జాగ్రతలు తీసుకోవాలన్నారు. యోగాంధ్రలో భాగంగా ఈ నెల 5వ తేదీన నాగార్జునసాగర్ వద్ద పదివేలమందితో కార్యక్రమం నిర్వహించానున్నామని, నాల్గవ తేదీన అనుపు వద్ద సుమారు వెయ్యిమందితో యోగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. జేసీ సూరజ్ గనోరే మాట్లాడుతో సిటిజన్ రిజిస్ట్రేషన్ వేగవంతం చేసి నిర్ణీత లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ బీవీ రవి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ప్రసూన, డీఎల్‌డీ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
23న రెడ్‌క్రాస్ సాధారణ సమావేశం
నరసరావుపేట: జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ సాధారణ సమావేశం ఈనెల 23వ తేదీ సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్, జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి రెడ్‌క్రాస్ ప్యాట్రన్, వైస్ ప్యాట్రన్, లైఫ్ మెంబర్స్, లైఫ్ అసోసియేట్ మెంబర్స్ తమ గుర్తింపు కార్డులతో తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు


