డీఆర్‌డీఏ పీడీగా ఝాన్సీరాణి బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీఏ పీడీగా ఝాన్సీరాణి బాధ్యతల స్వీకరణ

Published Thu, Mar 20 2025 2:37 AM | Last Updated on Thu, Mar 20 2025 2:36 AM

నరసరావుపేట: జిల్లా డీఆర్‌డీఎ పీడీగా ఝాన్సీరాణి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె ఒంగోలు జిల్లాలో విజిలెన్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చారు. కలెక్టర్‌ పి.అరుణ్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గతంలో డీఆర్‌డీఏ పీడీగా పనిచేసిన బాలూనాయక్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల మేరకు ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

గేట్‌లో జశ్వంత్‌ భవానీకి 6వ ర్యాంక్‌

నరసరావుపేట ఈస్ట్‌: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్‌–2025 పరీక్షా ఫలితాలలో పట్టణానికి చెందిన పెంటేల జశ్వంత్‌ భవాని 6వ ర్యాంక్‌ సాధించాడు. జశ్వంత్‌ భవాని తండ్రి రాజశేఖర్‌ న్యాయవాదిగా పని చేస్తున్నారు. ముంబైలో 5జీ సిస్టమ్‌ ఇంజనీర్‌గా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి గేట్‌ పరీక్షలకు జశ్వంత్‌ సిద్ధం అయ్యాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో జాతీయ స్థాయిలో ర్యాంక్‌ సాధించాడు. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. ఇందులో దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో పరీక్ష రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జశ్వంత్‌ భవాని 6వ ర్యాంక్‌ సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని పలువురు అభినందనలు తెలియజేశారు.

1,27,005 బస్తాల మిర్చి రాక

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు బుధవారం 1,27,005 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 1,24,077 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల సగటు ధర రూ.10,500 నుంచి రూ.13,800 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 66,903 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.

డీఆర్‌డీఏ పీడీగా ఝాన్సీరాణి బాధ్యతల స్వీకరణ 1
1/2

డీఆర్‌డీఏ పీడీగా ఝాన్సీరాణి బాధ్యతల స్వీకరణ

డీఆర్‌డీఏ పీడీగా ఝాన్సీరాణి బాధ్యతల స్వీకరణ 2
2/2

డీఆర్‌డీఏ పీడీగా ఝాన్సీరాణి బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement