రాజకీయ బదిలీలకు నిరసనగా
ఎన్‌ఎస్పీ ఉద్యోగుల ఆందోళన
నరసరావుపేట: ఎన్‌ఎస్పీ అధికారులైన సూపరింటెండెంట్ ఇంజినీరు కృష్ణమోహన్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సుబ్బారావుల వేధింపులపై ఉద్యోగులు సోమవారం ఆందోళనకు దిగారు. ఎన్‌ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా వర్క్‌చార్జ్‌డ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే వద్ద నుంచి లెటర్ తీసుకొచ్చి రాష్ట్ర నాయకత్వంలో అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేస్తున్న నాగరాజు, కొండారెడ్డిలపై అభియోగాలు మోపుతూ ఇక్కడి నుంచి మాచర్లకు బదిలీ చేశారన్నారు. ఎటువంటి విచారణ లేకుండా అకస్మాత్తుగా బదిలీ చేయటంపై న్యాయ విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని తాము రావటం జరిగిందన్నారు. సమర్ధవంతంగా పనిచేసి అవార్డులు పొందిన చరిత్ర యూనియన్ నేతలకు ఉందని, కేవలం నాలుగైదు నెలల క్రితం అధికారులుగా వచ్చిన వారికి వీరి సమర్ధత ఏవిధంగా తెలుస్తుందని ప్రశ్నించారు. సాగర్ పరిధిలో సరైన ఏఈలు లేకపోయినా లస్కర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తూ ప్రతి ఎకరాకు నీరు అందేలా పనిచేస్తున్నారన్నారు. డీఈ, ఈఈలను మారుస్తారా, లేక తమ 60మంది ఉద్యోగులను మారుస్తారా అనేది తేల్చుకోవాలన్నారు. వీరిపై సీఈచే విచారణ చేస్తున్నారని తెలిసిందని, ఆ విచారణ ముగిసేంతవరకు బదిలీ రద్దుచేయాలని కోరారు. బదిలీ ఉపసహరించేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
మంగళగిరి టౌన్ : మంగళగిరి నగర పరిధిలోని బిస్మిల్లా హోటల్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం... గత 5 రోజుల నుంచి ఓ వ్యక్తి మంగళగిరి పాతబస్టాండ్ సమీపంలో వున్న బిస్మిల్లా హోటల్ దగ్గర ఉంటున్నాడు. అతని ఆరోగ్యం సరిగా లేదని, కొన్ని రోజులుగా భోజనం, తాగునీరు అందజేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఆ వ్యక్తి మృతి చెందాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి