జయపురం: రాంఛీ–విజయవాడ 326 జాతీయ రహదారి జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ పోలీసు స్టేషన్ పరిధి బొడొబంక ఘాట్ రోడ్డులో ఒక బస్సు, ట్రక్కులు ఢీ కొనటంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు బస్సు ఒక మహిళా ప్రయాణికురాలు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ప్రయాణికుల్లో కొంత మందికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. కుసుమపల్లు లోడుతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి మల్కన్‌గిరి నుంచి రాయగడకు ప్రయాణికులతో వెళ్తున్ను బస్సును ఢీకొని బోల్తాపడటంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అటువైపు వస్తున్న ఒక కారు కూడా బస్సుని ఢీకొనటంతో కారు డ్యామేజ్ అయింది. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న వారు అంబులెన్స్‌కు ఫోన్ చేసి క్షతగాత్రులను బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన వారిని జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. బొయిపరిగుడ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


