ఇంద్రావతి కటాఫ్‌ గ్రామాల ప్రజలకు బోట్ల సదుపాయం | - | Sakshi
Sakshi News home page

ఇంద్రావతి కటాఫ్‌ గ్రామాల ప్రజలకు బోట్ల సదుపాయం

Nov 13 2026 12:10 AM | Updated on Nov 13 2026 12:10 AM

కొరాపుట్‌: ఇంద్రావతి రిజర్వాయర్‌ కటాఫ్‌ గ్రామాల ప్రజలకు మోటారు బోట్ల సదుపాయం కలిగింది. నబరంగ్‌పూర్‌ జిల్లా తెంతులకుంటి సమితిలో ఉన్న రిజర్వాయర్‌ మధ్య ఉన్న గ్రామాలకు నబరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి రిబ్బన్‌ కత్తిరించి ప్రజలకు అంకితం ఇచ్చారు. రిజర్వాయర్‌ నిర్మాణంతో సుమారు 500 పైగా గ్రామాలు నీట మునిగాయి. నీటి మధ్య కొండల పై ఉన్న గ్రామాల ప్రజలు మాత్రం ఖాళీ చేయలేదు. ప్రభుత్వాలు కూడా ఈ విషయం పట్టించుకోలేదు. వీరు నీటి మీద నాటు పడవలు తో ప్రయాణం చేసి మైదాన ప్రాంతాలకు రాక పోకలు చేస్తుంటారు. దశాబ్దాలు గా వందలాది మంది ప్రజలు నీటి మధ్య కొండలపై నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. వీరు నాటు పడవల మీద ప్రయాణాలు చేస్తు మృత్యువాత పడుతున్నారు. దాంతో కటాఫ్‌ ప్రజల విజ్ఞప్తితో స్థానికంగా నడుస్తున్న ఒక ప్రైవేట్‌ సంస్థ ఈ పడవలు విరాళంగా ఇచ్చింది. ఈ పడవల రాక తో కటాఫ్‌ ప్రజలు జీవితాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement