సెంచూరియన్‌ వర్సిటీలో స్టాల్స్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

సెంచూరియన్‌ వర్సిటీలో స్టాల్స్‌ ఏర్పాటు

Nov 8 2026 5:35 AM | Updated on Nov 8 2026 5:35 AM

పర్లాకిమిడి: సెంచూరియన్‌ వర్సిటీ క్యాంపస్‌లో వ్యవసాయ విద్యార్థులకు ఎక్స్‌పీరియన్స్‌ లెర్నింగ్‌ కార్యక్రమం (ఏఈఎల్‌పీ)లో భాగంగా గ్రామీణ సంతను మహిళా స్వయం సహాయక గ్రూపులు, సహాకార సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ గ్రామీణ సంతలో మొత్తం 30 స్టాల్స్‌ ఏర్పాటు చేయగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ అనితా పాత్రో, డీన్‌ (అడ్మిన్‌) డా.సత్యప్రకాష్‌ నంద, అగ్రికల్చర్‌ డీన్‌ సాగర్‌ మైత్రా, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ డీన్‌ డా.ప్రజ్ఞాపాణి, ఇంజినీరింగ్‌ స్కూల్‌ డీన్‌ డా.ప్రఫుల్ల కుమార్‌ పండా, ఫ్యాకల్టీ సభ్యులు విద్యార్థులు హాజరయ్యారు. ఈ గ్రామీణ సంతలో తయారు చేసిన వంటకాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంట్లో చేసిన వివిధ రకాల ఫుడ్‌ ఉత్పత్తులు, హస్త కళలు, స్థానికంగా తయారు చేసిన ఫాస్ట్‌ఫుడ్స్‌ ఉంచారు. జిల్లాలో స్వయం సహాయక గ్రూపులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల్లో అమ్మకానికి మార్కెట్‌ లింకేజీ, తద్వారా కుటీర పరిశ్రమ నుంచి దేశవాళీ పరిశ్రమగా అభివృద్ధి చెందుతుందని మహిళా గ్రూపులు తెలియజేశారు. ఈ గ్రామీణ సంతద్వారా వ్యవసాయ విద్యార్థుల్లో కొంత అవగాహనతో పాటు మార్కెటింగ్‌, వాణిజ్యం, స్వయం ఉపాధి వంటి విజ్ఞానం లభిస్తుందని సెంచూరియన్‌ వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement