మల్కన్‌గిరి: ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని స్థానిక మాలికేశ్వర్ జేఎన్‌ఎం కళాశాల అధ్యాపకురాలు రాజేశ్వరి పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎక్స్‌బోర్డు పాఠశాలలో బాలల సంరక్షణ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల భద్రత, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరిశుఽభ్రతపై అవగాహన కల్పించారు. రోజువారీ జీవితంలో ఎలా పరిశుభ్రత పాటించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరించారు. పిల్లలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సుకాంత్ కుమార్ సాహు, సంధ్యారాణి నాయక్, సునీత సాహు, మధుస్మితా సేనాపతి, మమతా స్వాయిన్, అమితా చౌదరి తదితరులు పాల్గొన్నారు.


