కమనీయం.. కార్తీకం! | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. కార్తీకం!

Nov 8 2026 5:35 AM | Updated on Nov 8 2026 5:35 AM

ఎన్నెన్నో విశిష్టతలు..

● శివారాధనకు

సిద్ధమైన

ఆలయాలు

● రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ఆరంభం

ఇచ్ఛాపురం రూరల్‌:

శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఒరియా మాట్లాడే ఉత్కళాంధ్రులకు ఇప్పటికే గౌరీ పౌర్ణమి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కాగా, హిందూ సంప్రదాయం ప్రాకారం ఎంతో విశిష్టత ఉన్న కార్తీక మాసోత్సవాలు తెలుగు ప్రజలకు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. శివుడు, విష్ణువులిద్దరి పూజలకు ఎంతో ప్రత్యేకమైంది కాబ ట్టీ ఈ మాసానికి సమానమైనదేదీ లేదనేది భక్తుల భావన. ఈ మాసంలో ప్రతి రోజూ పర్వదినమే. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన దినాలు మరింత ఫలప్రదమైనవి. ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రో జు నుంచి ఈ మాసం ప్రారంభమవ్వడం సంప్రదాయం. భక్తులంతా నిత్యం భోళాశంకరుడి నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక చింతన కోసం జిల్లాలోని శివాలయాలకు కొత్త రంగులు వేస్తూ రంగురంగుల విద్యుద్ధీపాలతో ముస్తాబు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఆకాశ దీపాలు, తులసిమొక్క వద్ద దీపాలు వెలిగించి ఆరాధిస్తారు.

● కార్తీక మాసంలో ఉభయ పక్షాల్లో అనేక వ్రతాలు ఉన్నాయి.

● అయ్యప్ప దీక్ష ఈ మాసంలోనే ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.

● శివ మాలలు ధరించి భక్తులు ఇప్పటికే దీక్షలు ప్రారంభం కావడంతో కార్తీక పౌర్ణమి వరకు కొనసాగుతాయి.

● సోమవారం నాడు ఉపవాసం చేిసి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

● కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

● పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్ధశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో వివపార్వతులు అనుగ్రహానికి మహిళలు పూజలు చేస్తుంటారు.

● ప్రతి శనివారం వేకువజామున రావి చెట్టుకు తెలుపు, పసుపు దారాలు చుట్టీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

● శివుడికి బిల్వ దళాలు, జిల్లేడు పూలతో అర్పించిన వారికి ఇహపర సౌక్యాలు కలుగుతాయని నమ్మకం.

● విష్ణువుకు తులసి దళాలు, మల్లెలు, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక దర్పాలతో పూజిస్తారు.

ఉపవాసం..

దాన మాసం..

కార్తీక మాసంలో ఉపవాసం ఉండేందుకు, దానం చేసేందుకు ప్రాధాన్యమిస్తారు. స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని విశ్వసిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ఉసవాసముండి రుద్రాభిషేకాలు చేస్తారు. దీపారాధనతో పాపాలు తొలగుతాయని భావిస్తారు. ముఖ్యంగా మహిళలు దీపారాధనకు ప్రాధాన్యమిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక వేడుకలతో ఈ శీతాకాలం ఆలయాలు హిమదీపాల కాంతుల్లో కమనీయంగా మారుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement