మల్కన్‌గిరి: మారుమూల ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజశిర్కే అన్నారు. జిల్లాలోని చిత్రకొండ సమితి ధూళిపూట్ పంచాయతీ జుమడాంగ్ గ్రామంలో 10 నూతన సోలార్ లైట్లను శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వ పథకాలు, ప్రాథమిక సౌకర్యాలు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. సౌరశక్తి వంటి పర్యావరణహిత ఇంధన వనరులను వినియోగించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సైతం నిరంతర విద్యుత్ వెలుగులను అందించడం సాధ్యమవుతోందని వెల్లడించారు.
జయపురం: స్థానిక గీతా భవన్‌లో కొరాపుట్ జిల్లా ఆయుర్వేద వికాస పరిషత్ ఆధ్వర్యంలో జయపురం పట్టణంలో వైద్య భగవాన్ ధన్వంతరి జయంతిని పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సుదర్శన గౌడ అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన గౌడ మాట్లాడుతూ.. ధన్వంతరి ప్రపంచానికి అందించిన అమూల్య వైద్యాన్ని కొనియాడారు. జిల్లా ఆయుర్వేద వికాస పరిషత్ తరపున రోగులకు ఉచితంగా ఆయుర్వేద మందులు అందజేశారు. కార్యక్రమంలో పరిషత్ కార్యదర్శి కవిరాజ్ పరమేశ్వర పాత్రో, ఉపాధ్యక్షుడు క్షేత్రబాసు పండ, న్యాయ సలహాదారు రాజేంద్ర కుమార్ గౌడ, సలహాదారు కవిరాజ్ జవహార్ జెన, కోశాధికారి శ్రీనివాస్ పాత్రో, మదన మోహన్ నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
పర్లాకిమిడి: జిల్లాలో కాశీనగర్, రాయఘడ బ్లాక్‌లలో దీపావళి బాణసంచాను ఎటువంటి లైసెన్సు లేకుండా అమ్ముతుండడంతో పోలీసు లు పట్టుకుని ఎక్స్‌ప్లోజివ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేర కు కాశీనగర్‌లో రూ.లక్ష మందుగుండు సామా న్లు అక్రమంగా నిల్వ ఉంచినందున ఒకరిని పట్టుకున్నారు. రాయఘడలో మహిళ వద్ద నుంచి రూ.10 వేల బాణసంచాను పట్టుకుని కేసు లు నమోదు చేసినట్లు ఎస్‌డీపీవో అమితావ్ పండా తెలియజేశారు.
ఆమదాలవలస :
ప్రతిఒక్కరూ సుస్థిర జీవనశైలి అలవర్చుకోవాలని ఆమదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.బాలకృష్ణ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 1 నుంచి 7 వరకు బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు నిర్వహించారు. శనివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కళాశా ల ప్రాంగణంలో పొడి, తడి, ఎలక్ట్రానిక్ వ్యర్థా లను వేర్వేరుగా సేకరించి వాటి నిర్వహణపై అవగాహన కల్పించారు. వ్యర్థ పదార్థాలతో కళారూపాలు తయారు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిరోజూ సుస్థిర జీవనశైలి ప్రతిజ్ఞ చేయించా రు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశా రు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


