స్కూల్‌గేమ్స్‌ పోరు.. క్రీడాకారుల జోరు | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌గేమ్స్‌ పోరు.. క్రీడాకారుల జోరు

Nov 8 2026 5:35 AM | Updated on Nov 8 2026 5:35 AM

శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్‌ ఎంపిక పోటీల్లో క్రీడాకారులు జోరు కనబర్చారు. జిల్లా కేంద్రంలోని పలు క్రీడామైదానాల్లో జరిగిన స్కూల్‌గేమ్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌కు శనివారం జిల్లా నలుమూలల నుంచి సుమారు మూడు వేల మంది పాఠశాల విద్యార్థులు పోటెత్తారు. రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ పోటీల షెడ్యూల్‌కు అనుగుణంగా 13 క్రీడాంశాల్లో ఎంపికలు పూర్తి చేశారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, హాకీ, స్విమ్మింగ్‌, టేబుల్‌టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, ఫెన్సింగ్‌, సాఫ్ట్‌టెన్నిస్‌, స్క్వాస్‌, చెస్‌, ఫుట్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌ క్రీడాంశాల్లో అండర్‌–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు ఎంపికలు చేపట్టారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానాల్లోనే 10 క్రీడాంశాల ఎంపికలు పూర్తిచేశారు. శ్రీకాకుళం టౌన్‌హాల్‌ వేదికగా ఫెన్సింగ్‌ ఎంపికలను చేపట్టారు. పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా సాఫ్ట్‌టెన్నిస్‌, స్క్వాష్‌ ఎంపిక పోటీలు నిర్వహించారు.

పర్యవేక్షించిన డీఈఓ..

జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్‌ ఎంపిక పోటీలను ఎస్‌జీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు, జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు పర్యవేక్షించారు. వివిధ క్రీడాంశాల్లో పాల్గొన్న క్రీడాకారులతో ముచ్చటించారు. రాష్ట్రపోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణింపే లక్ష్యంగా తీర్చిదిద్దాలని కోచ్‌లకు సూచించారు.

ఈ ఏడాది ఫలితాలు అదుర్స్‌..

స్కూల్‌గేమ్స్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సాధిస్తున్న ప్రభంజనాన్ని, ప్రగతిని, ఫలితాలను ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ చల్లా జగదీష్‌ వివరించారు. క్రీడల ద్వారా లభిస్తున్న అవకాశాలను పీడీ–పీఈటీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ క్రీడాకారులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా ముఖ్య సలహాదారు పి.సుందరరావు, ఎస్‌జీఎఫ్‌ మహిళా సెక్రటరీ జీఎం జ్యోతిరాణి, హెచ్‌ఎం యాళ్ల పోలినాయుడు, మెట్ట తిరుపతిరావు, ఎం.ఆనంద్‌కిరణ్‌, కె.మాధవరావు, శ్రీనివాసరావు, కె.రవికుమార్‌, రెడ్డి రవి, గురుగుబెల్లి రాజశేఖర్‌, ఢిల్లేశ్వరరావు, స్వీటీ, రోజా, ఈశ్వరరావు, మహంతి, చిన్నికృష్ణ, మధు, ఆయా క్రీడాంశాల ఇన్‌ఛార్జ్‌లతోపాటు సెలక్షన్‌ కమిటీ సభ్యులు, పీడీలు పాల్గొన్నారు.

ఉత్సాహంగా స్కూల్‌గేమ్స్‌ జిల్లాస్థాయి

ఎంపిక పోటీలు

13 క్రీడాంశాల్లో ముగిసిన ఎంపికల ప్రక్రియ

జిల్లా నలుమూలల నుంచి 3వేల మంది హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement