జయపురం: సబ్ డివిజన్ కోట్‌పాడ్‌లో భారత్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పద్మిణీ దియాన్ పాల్గొన్నారు. భవన నిర్మాణానికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో అప్పటి మంత్రి పద్మిణీ దియాన్ రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఆ నిధులతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ కుమార్ మిశ్ర వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పద్మిణీ దియాన్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజలు, పాలకులకు మధ్య వారదిగా ఉండాలని సూచించారు. నిజాయితీగా వాస్తవాలను ప్రచురించాలని, అప్పుడే సమాజం ప్రగతి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. అజయ కుమార్ మిశ్ర అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోట్‌పాడ్ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర మఝి, కోట్‌పాడ్ న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు మణిప్రసాద్ పట్నాయిక్, కోట్‌పాడ్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పంకజ్ కుమార్ పాత్రో తదితరులు పాల్గొన్నారు.


