దారి కాచి..స్టేషన్‌కు రావాలని బెదిరించి.. | - | Sakshi
Sakshi News home page

దారి కాచి..స్టేషన్‌కు రావాలని బెదిరించి..

Nov 1 2026 12:39 AM | Updated on Nov 1 2026 12:39 AM

దారి కాచి..స్టేషన్‌కు రావాలని బెదిరించి..

బైండోవర్‌ పేరుతో వైఎస్సార్‌సీపీ

కార్యకర్తలకు వేధింపులు

టెక్కలి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై వేధింపులు మితిమీరుతున్నాయి. టెక్కలి నియోజకవర్గంలో బైండోవర్‌ పేరుతో వైఎస్సార్‌సీ పీ కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి రోజంతా పడిగాపులు కాయిస్తున్నారు. శనివారం టెక్కలి లో కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను స్టేషన్‌ కు పిలిపించి రోజంతా పడిగాపులు కాయించారు. ఈ క్రమంలో బైండోవర్‌ నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్త చింతాడ జీవన్‌ను పోలీస్‌స్టేషన్‌ కు పిలిపించారు. తాను తహసీల్దార్‌ కార్యాలయాని కి వచ్చి బైండోవర్‌ నమోదు చేయించుకుంటానని పోలీసులకు చెప్పారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో, తిరిగి వెళ్తుండగా కచేరీవీధి సమీపంలో నలుగు రు పోలీసులు జీవన్‌ను అడ్డగించి, నీపై బైండోవర్‌ నమోదు చేసేందుకు సీఐ తీసుకురమన్నారని చెప్పారు. తాను ఆదివారం తహసీల్దార్‌ కార్యాలయానికి వస్తానని చెప్పినా వినలేదు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ చేరుకుని ఉదయం పోలీస్‌స్టేషన్‌కు పంపిస్తానని చెప్పి జీవన్‌ను తనతో పాటు తీసుకువెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement