ఇచ్ఛాపురం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అక్ర మ మద్యం, నాటుసారా తయారీ, రవాణా నియంత్రణకు ఎకై ్సజ్ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏ ర్పాటు చేస్తున్నారు. శనివారం బరంపురంలో ఒడిశా ఎకై ్సజ్ అధికారులతో ఇచ్ఛాపురం ఎకై ్సజ్ అధికారులు సమావేశమై సరిహద్దు ప్రాంతాల్లో ఉమ్మడి దాడులు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. శ్రీకాకుళం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తిరుపతినాయుడు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు కుమార్, మురళీధర్, ఇచ్ఛాపురం ఎకై ్సజ్ మొబైల్ స్క్వాడ్ సీఐ జి.వి.రమణ పాల్గొన్నారు.


