కొరాపుట్:
ఆంధ్రప్రదేశ్–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో అక్రమ మద్యం అరికట్టడానికి ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. గురువారం కొరాపుట్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశం జరిగింది. కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం లో సరిహద్దులో నాటు సారా, సుంకం చెల్లించని మద్యం రవాణాలను అడ్డుకునేందుకు చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాలలో వివిధ కేసుల్లో ఉన్న నిందితుల వివరాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రతి నెల సంయుక్తంగా దాడులు చేయనున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలలో అక్రమ మద్యం పై కఠిన చర్యలు తీసుకోనున్నారు. సమావేశం లో అదనపు ఎస్పీ మనోజ్, కొరాపుట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ పాడీ, పార్వతీపురం మన్యం జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి కె.సహదేవ, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరెండెంట్ సంతోష్ గోపాలకృష్ణ, పార్వతీపురం ఎకై ్సజ్ ఎస్హెచ్ఓ నరసింహమూర్తి, టాస్క్ఫోర్స్ సీఐ శేఖర్ బాబు,సాలురు ఎకై ్సజ్ ఎస్హెచ్ఓ దాసు,ఇతర అధికారులు పాల్గొన్నారు.


