జయపురం: జయపురం సబ్ డివిజన్ కోట్‌పాడ్‌లో గోమాంసం పట్టుకున్నట్లు కోట్‌పాడ్ పోలీసు అధికారి రుణు మఝి తెలిపారు. కోట్‌పాడ్ పోలీసుస్టేషన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 10 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి దాదాపు 9 క్వింటాళ్ల గోమాంసం స్వాధీనం చేసుకున్నామన్నారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తాము ఒక బృందంగా ఏర్పడి కోట్‌పాడ్ పట్టణంలోని ఖాళ్లవీధి ప్రాంతంలో దాడులు నిర్వహించి, గోమాంసం అమ్ముతున్న 10 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడిలో ఎస్‌ఐ దీప్తి ధరువ, ఏఎస్‌ఐ దేవానంద నాయిక్, ఏఎస్‌ఐ మహాంశు రథ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్‌తో ఎలుగుబంటి దుర్మరణం
జయపురం: విద్యుత్ షాక్‌తో ఎలుగు బంటి దుర్మరణం చెందిన ఘటన జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి బెంధ్రాగుడ గ్రామ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామ సమీపంలోని 33 కేవీ వాల్ట్ విద్యుత్ లైన్ ప్రాంతంలో విద్యుత్ వైర్ ఒక చెట్టుకు తగిలి ఉండగా ఆహారం కోసం గాలిస్తున్న ఎలుగుబంటికి విద్యుత్ తీగ తగిలి మరణించింది. మరణించిన ఎలుగుబంటికి 7 ఏళ్లు ఉంటాయని, అది కొద్దిరోజుల క్రితమే ఒక బిడ్డకు జన్మనిచ్చిందని అటవీ వర్గాలు భావిస్తున్నాయి. ఎలుగుబంటి మృతదేహాన్ని సమీప అడవిలో పాతి పెట్టినట్లు బొయిపరిగుడ అటవీ విభాగ అధికారి బలరాం నాయిక్ వెల్లడించారు.
తిండిగుడలో రేషన్ పంపిణీ
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని ఆర్.ఉదయగిరి బ్లాక్‌లో కురిసిన వర్షాలకు తండిగుడ గ్రామం నీటిలో మునిగిపోయింది. ప్రజలకు తినేందుకు ఆహారం లేకపోయింది. ఆర్.ఉదయగిరి నోడల్ అధికారి ఏడీఎం మునీంద్ర హానగ ఆదేశాల మేరకు ఓడ్రాఫ్ బృందం సభ్యులు తండిగుడ గ్రామస్తులకు గురువారం రేషన్‌ను అందజేశారు. జిల్లాలో ఆర్.ఉదయగిరిలో 29 తేదీన 175.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మోహనా బ్లాక్‌లో రికార్డు స్థాయిలో 200 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్టు జిల్లా అత్యవసర విభాగం తెలియజేసింది.
కొట్టుకొచ్చిన కొండచిలువ
మల్కన్‌గిరి: స్థానిక ఝాటిమాటి కాలనీలో బుధవారం రాత్రి 6 అడుగుల కొండచిలువను చూసిన స్థానికులు భయకంపితులయ్యారు. దీంతో వెంటనే స్నేక్ హెల్ప్‌లైన్ బృందానికి సమాచారం ఇవ్వడంతో.. అనూ అనే స్నేక్ హైల్ప్‌లైన్ సభ్యుడు తన బృందంతో వచ్చి వర్షంలో కొట్టుకు వచ్చిన కొండచిలువలను పట్టుకున్నారు. అనంతరం దానికి అడవిలో సురక్షితంగా విడిచిపెట్టారు.


