తుఫాన్‌ ధాటికి అప్రోచ్‌ రోడ్లు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ ధాటికి అప్రోచ్‌ రోడ్లు ధ్వంసం

Oct 30 2026 7:00 AM | Updated on Oct 30 2026 7:00 AM

పర్లాకిమిడి: అర్నబ్‌ తుఫాన్‌తో గజపతి జిల్లాలో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. రాయగడ బ్లాక్‌ బోడోతుండి వంతెన అప్రోచ్‌ రోడ్డుకు గండి ఏర్పడింది. దీంతో రాయగడ నుండి ఆర్‌.ఉదయగిరి, మోహనకు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కొన్ని ప్రైవేటు బస్సులు సర్వీసులు బంద్‌చేశారు. గుమ్మ బ్లాక్‌ మునిసింగి ఘాట్‌ వద్ద చెట్లు విరిగిపడటంతో పర్లాకిమిడికి రాకపోకలు బంద్‌ అయ్యాయి. ఓడ్రాఫ్‌ సిబ్బంది మునిసింగి వద్ద చెట్ల కొమ్మలు యంత్రాలతో తొలగించారు. రాష్ట్ర ఆరోగ్య, సంక్షేమశాఖ అదనపు కార్యదర్శి బిజయకుమార్‌ దాస్‌ నువాగడ బ్లాక్‌ ఖోజురిపద ప్రజా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ రోగులకు సరైన వైద్యం అందుతుంతో లేదో అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర క్రీడా, యువజన శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్‌ ఈరోజు కాశీనగర్‌ బ్లాక్‌లో భూపతి లక్ష్మీపురం,

సరా, పాలసింగి, గుమ్మబ్లాక్‌లో తలసింగి, మునిసింగి పంచాయతీ తలసింగి, బరాంసింగి గ్రామాల్లో పర్యటించి అక్కడ ఆశ్రయ స్థలాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులను పరామర్శించారు. జిల్లాలో అనేక చోట్ల వర్షం మధ్యాహ్నం నుంచి తెరిపిచ్చింది. ప్రస్తుతం ముంపు గ్రామాల్లో సహాయకచర్యలు కోనసాగుతున్నట్టు ఏడీఎం, నోడల్‌ అధికారి మునీంద్ర హానగ తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement