రాయగడ: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. గుణుపూర్‌లో అత్యధికంగా 118.2 మిల్లీమీటర్ల వాన కురిసినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా జిల్లాలోని పలు నదుల్లో నీటిమట్టాలు పెరుగుతుండగా, గుణుపూర్ వద్ద వంశధార నది హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. గురువారం ఉదయం 10 గంటల సమయానికి గుణుపూర్ వద్ద వంశధార నది నీటిమట్టం 83.35 మీటర్లకు చేరింది. ఇక్కడ నది హెచ్చరిక స్థాయి 84 మీటర్లుగా ఉంది. దీంతో నది నీటిమట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తత అవసరమైంది. గజపతి జిల్లాలోని హరభంగి డ్యామ్ నుంచి రెండు గేట్లు ద్వారా 543.134 క్యూమెక్స్ నీటిని విడుదల చేయడంతొ వంశధార నదిలో నీటిమట్టం పెరుగుతున్నట్లు కేంద్ర జల సంఘం వర్గాలు వెల్లడించాయి. నదిలో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.


