జూద శిబిరాలపై పోలీసుల దాడులు | - | Sakshi
Sakshi News home page

జూద శిబిరాలపై పోలీసుల దాడులు

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

● డ్రైవర్‌కు గాయాలు

రాయగడ: జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్న జూద శిబిరాలపై జిల్లా పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల్లో చేపట్టిన దాడుల్లో 23 మందిని అదుపులోకి తీసుకోగా.. 38,970 రూపాయల నగదుతో పాటు నాలుగు మోటార్‌ సైకిళ్లు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బొగ్గు లారీ బోల్తా

రాయగడ: విశాఖపట్నం నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి జిమిడిపేట సమీపంలోని రాజ్‌పూర్‌ వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ మునిమా కుస స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతడిని వెంటనే జిమిడిపేట పీహెచ్‌సీకి చికిత్స నిమిత్తం తరలించారు. సోమవారం ఉదయం విశాఖపట్నం నుంచి రాయిపూర్‌ వెళుతున్న లారీ అదుపు తప్పడంతో రాజ్‌పూర్‌ వద్ద బోల్తాపడింది. సమాచారం తెలుసుకున్న శెశిఖాల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం జేసీబీతొ లారీని పక్కను తొలగించారు.

సురక్షిత ప్రాంతాలకు తరలింపు

రాయగడ: అర్నబ్‌ తుఫాన్‌ ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి తెలిపారు. గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు సహాయక బృందాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 60 మంది గర్భిణులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. మొత్త 148 గ్రామాలను తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. జిల్లాలో 84 ఆశ్రయ కేంద్రాలు అందుబాటులో ఉన్నట్లు కలక్టర్‌ తెలిపారు. భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో జిల్లాలోని అన్ని సమితుల బీడీఓలు, తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. .

తుఫాన్‌ నేపథ్యంలో..

పర్లాకిమిడి: తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు పర్యటిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ ఒడిశాలో అర్నాబ్‌ తుపాను ప్రభావం ఉంటుందని కలెక్టర్‌ అక్షయ సునీల్‌ అగర్వాల్‌ తెలియజేశారు. గుమ్మబ్లాక్‌లో జిల్లా వ్యవసాయ అధికారులు ఖరీఫ్‌ పంటకు నష్టం వాటిల్లనున్నదని అందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. దీంతో గుమ్మ, నువాగడ సమితిల్లో పండిపోయిన వరిచేనును కోసి సురక్షిత ప్రాంతాలకు రైతులు తరలిస్తున్నారు.

తుఫాన్‌పై సమీక్ష

పర్లాకిమిడి: తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ ఆదనపు సెక్రటరీ బిజయకుమార్‌ దాస్‌ పర్లాకిమిడి కలెక్టరేట్‌కు విచ్చేశారు. కలెక్టరేట్‌లో ఓస్వాన్‌ కాన్ఫరెన్సు హాలులో కలెక్టర్‌ అక్షయ సునీల్‌ అగర్వాల్‌, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహిలు వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ అగార్వాల్‌, అదనపు సెక్రటరీ బిజయ కుమార్‌ దాస్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మఝితో నేరుగా వర్చువల్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం నుంచి పెనుగాలులు ప్రారంభమై 27, 28 తేదీలలో గజపతి జిల్లాలో ఎడతెరిపి గాలులు, వర్షాలు పడతాయని కలెక్టర్‌ అన్నారు. జిల్లాలో 210 గర్భిణులను వెంటనే దగ్గరలో వున్న ఆశ్రయ స్థలాలు, లేదా పీహెచ్‌సీలకు తరలించాలని కలెక్టర్‌ అగర్వాల్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement