మల్కన్‌గిరి : ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో అక్రమ గంజాయి రవాణాదారులపై చర్యలు తీసుకుంటున్న పోలీసులు తాజాగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. కలిమెల పోలీసుస్టేషన్ పరిధిలో పప్పులూర్ పంచాయతీ నాగులూర్ గ్రామం అడవిలో సోమవారం అటవీ భూమిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న కటేయా నైనూ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రెండెకరాల భూమిలో ఈ గంజాయి సాగును చేస్తున్నాడు. ఎస్పీ వినోద్ పటేల్ ఆదేశాల మేరకు కలిమెల ఐఐసీ ప్రభుదత్త తన బృందంతో చేరుకుని రెండువేలకుపైగా గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.


