ఆగని ప్రసవ వేదనలు | - | Sakshi
Sakshi News home page

ఆగని ప్రసవ వేదనలు

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

రాయగడ: ఖనిజ సంపదలకు నిలయమైన జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు కనీస రహదారి సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపొవడంతో వైద్య సేవలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. తాజాగా కాసీపూర్‌ సమితిలోని మలిపదర్‌ గ్రామంలో గర్భిణికి పురిటినొప్పులు రావడంతో ఆంబులెన్స్‌ వరకు సుమారు 5 కిలోమీటర్ల దూరం కుటుంబ సభ్యులు ఆమెను మోసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఆ మహిళ మృత శిశువుకు జన్మనివ్వడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. సుంగేరు పంచాయతీ పరిధిలోని మాలిపదర్‌ గ్రామానికి చెందిన ఆర్జున మాఝి భార్య సుకు మాఝి (35) కు ఆదివారం నాడు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. విషయం తెలుసుకున్న ఆశా కార్యకర్త అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో అంబులెన్స్‌ అలిగుణ గ్రామం సమీపంలో నిలిచిపోయింది. దీంతో మారుమూల కొండ ప్రాంతంలోని గ్రామం నుంచి గర్భిణిని కుటుంబ సభ్యులు ఓ చీరలో కూర్చోబెట్టి సుమారు 5 కిలోమీటర్ల దూరం మోసుకుంటూ అంబులెన్స్‌ వద్దకు వెళ్లారు. ఈ సమయంలో అంబులెన్స్‌ డ్రైవరు దీపక్‌ గోపాల్‌ కూడా వారికి సహకరించారు. అనంతరం గర్భిణిని సమీపంలోని సుంగేర్‌ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా అక్కడ వైధ్యులు అందుబాటులో లేకపోవడంతో కాసీపూర్‌ సామాజికి ఆరొగ్య కేంద్రానికి తరలించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే అక్కడి నుంచి జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ సుకు మాఝి మృత శిశువుకు జన్మనిచ్చినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement