కొఠియాలో ఒడిశా ప్రభుత్వం భద్రతా చర్యలు | - | Sakshi
Sakshi News home page

కొఠియాలో ఒడిశా ప్రభుత్వం భద్రతా చర్యలు

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

కొరాపుట్‌: ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాలో ఒడిశా ప్రభుత్వం భద్రతా చర్యలు పటిష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం పార్వతీ పురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కొఠియా గ్రామాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మురం చేసింది. ఇందుకు అభ్యంతరంగా కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితి కొఠియా పంచాయితి రక్షించుకోవడానికి ప్రభుత్వం నడుం బిగించింది. కొరాపుట్‌ జిల్లా ఉన్నతాధికారుల బృందం కొఠియాలో తిష్ట వేసింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులు ఉన్న కొఠియా మార్గాల్లో ఒడిఽశా పోలీసులు పెద్ద ఎత్తున్న మోహరించారు. రాత్రింబవళ్లు ఆ మార్గంలో వస్తున్న వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆంధ్రా నుంచి అనుమానాస్పద వ్యక్తులు వస్తే తిరిగి పంపించేస్తున్నారు. మొత్తం 21 గ్రామాలలో ప్రతి కదలిక మీద నిఘా కొనసాగిస్తున్నారు. ఆంధ్ర ఎన్నికల ఏర్పాట్లను నిలువరిస్తున్నారు. కొరాపుట్‌ జిల్లా అఽధికార యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లపై పార్వతీపురం మన్యం జిల్లా అధికార యంత్రాంగం నిశితంగా పరిశీలిస్తుంది. మరో వైపు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఆంధ్రా పోలీసులు కొఠియాలో పర్యటించారు. ఎస్‌ఐ సత్యనారాయణ నేతృత్వంలో స్పెషల్‌ టీం వివాదాస్పద గ్రామాల్లో ప్రత్యేక పరిశీలన చేశారు. పలు చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర పోలీసుల పర్యటనతో ఒడిశా యంత్రాంగం అప్రమత్తమైంది. మరో వైపు ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కొఠియాలో బల ప్రదర్శన నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement