లోక్‌భవన్‌, రైల్వే కార్యాలయాల్లో సమగ్రతా ప్రతిజ్ఞ | - | Sakshi
Sakshi News home page

లోక్‌భవన్‌, రైల్వే కార్యాలయాల్లో సమగ్రతా ప్రతిజ్ఞ

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

భువనేశ్వర్‌:

కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాల మేరకు అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 1 వరకు నిర్వహిస్తున్న అవినీతి వ్యతిరేక విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల సందర్భంగా సోమవారం లోక్‌భవన్‌తో పాటు తూర్పు కోస్తా రైల్వే జోనల్‌, మండల ప్రధాన కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు సమగ్రతా ప్రతిజ్ఞ చేశారు. ‘శ్రేయస్సు కోసం నిజాయితీ’ ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలు ప్రజల్లో అవినీతిపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రజా విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో నిజాయితీ, సమగ్రత, జవాబుదారీతనం ప్రాధాన్యాన్ని చాటిచెబుతున్నాయి. ఈ సందర్భంగా భువనేశ్వర్‌లోని లోక్‌ భవన్‌ అభిషేక్‌ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మరో వైపు రైల్‌ సదన్‌లోని తూర్పు కోస్తా రైల్వే జోనల్‌ ప్రధాన కార్యాలయంలో జనరల్‌ మేనేజర్‌ పరమేశ్వర్‌ ఫంక్వాల్‌, ఖుర్దారోడ్‌ మండల కార్యాలయంలో డీఆర్‌ఎం డి.సునీల్‌ అధికారులు, ఉద్యోగులతో సమగ్రతా ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement