భువనేశ్వర్: శరన్నవరాత్రులు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దుర్గామాత ఽపూజా మండపాల్ని హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పూజా కమిటీ సభ్యులు, నిర్వాహకులకు అభినందించారు. పండరా, షహీద్ నగర్, పొలాసుణి, ఝరపడా, రసుల్‌గడ్ తదితర పూజా మండపాల్ని సందర్శించి దేవీ దర్శనం చేసుకున్నారు. దేవీ పూజల నిర్వహణ యువతలో ఆధ్యాత్మిక భావన ప్రతిబింబించింది. సోదరభావం, స్నేహం, ఆధ్యాత్మిక అనుబంధంతో యువత సమైక్యంగా ముందుకు సాగాలని ప్రోత్సహించారు.


