ఆదుకోండి మహాప్రభో..! | - | Sakshi
Sakshi News home page

ఆదుకోండి మహాప్రభో..!

Oct 23 2026 1:39 AM | Updated on Oct 23 2026 1:39 AM

● అమరావతి నుంచి పర్లాకిమిడికి వచ్చిన దివ్యాంగుడు

పర్లాకిమిడి : నేను చదువుకుంటానని.. ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్న మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి వచ్చిన అమిత్‌ కులకర్ణి అనే దివ్యాంగుడు పర్లాకిమిడి ఉపకారాగారం రోడ్డులో యాచిస్తున్నాడు. చిన్నప్పుడే పోలియోతో బాధపడుతున్న సమయంలో తండ్రి హరిశ్చంద్ర కులకర్ణి అమిత్‌ కులకర్ణిని చదివించాడు. తండ్రి చనిపోయిన తరువాత కూడా చదువుపై ఆసక్తి ఉన్నా ఆదుకునే వారు లేక.. ఆర్థికంగా వెనుక బడినందున పలు రాష్ట్రాలు తిరుగుతూ పర్లాకిమిడికి చేరుకున్నాడు. 90 శాతం దివ్యాగుడైన అమిత్‌ కులకర్ణికి మూగ, చెవిటి వంటి అంగవైకల్యం ఉన్నందున తన బాధలను చెప్పలేకపోతున్నాడు. పర్లాకిమిడిలో ఎండలు అధికంగా ఉన్నా.. రోడ్ల వెంబడి వచ్చిపోయిన వాహనాలు ఆపుతూ యాచించడం పలువురిని కలిచి వేసింది. కొంతమంది దాతలు ఆర్థిక సహాయం, తినడానికి ఆహారం అందజేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement