కోతులను వేటాడి.. వాటిని వండుకుని | - | Sakshi
Sakshi News home page

కోతులను వేటాడి.. వాటిని వండుకుని

Oct 23 2026 1:39 AM | Updated on Oct 23 2026 1:39 AM

రాయగడ: అడవిలో మూడు కోతులను వేటాడి, వాటి మాంసాన్ని వండుకుంటున్న ముగ్గురు వ్యక్తులపై అటవీ శాఖ అధికారులు దాడి చేశారు. వీరిలో ఇద్దరు పరారు కాగా.. ఒకరు దొరికిపోయారు. ఇతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం బిసంకటక్‌ జైలుకు తరలించారు. జిల్లాలోని మునిగుడ అటవీ పరిధిలోని డెపాగుడ బీట్‌, పీఆర్‌ఎఫ్‌ పరిధిలో పత్రాని గ్రమ సమీపంలో గల అడవిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఉదంతం పై అటవీ శాఖ అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం..

మునిగుడ రేంజర్‌ ప్రవీన్‌ కుమార్‌ దాస్‌ ఆదేశాల మేరకు ఫారెస్టర్‌ ప్రమోదిని మండంగి నేతృత్వంలో అటవీ సిబ్బంది, వన్యప్రాణి సంరక్షణ బృందం సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అడవిలో గస్తీ నిర్వహించారు. ఈ క్రమంలో పత్రాని గ్రామ సమీపంలో గల అడవిలో ముగ్గురు వ్యక్తులు మంట పెట్టుకుని వంట చేస్తుండటాన్ని గమనించిన అధికారులు అనుమానంతో అక్కడికి చేరుకుని తనిఖీ చేశారు. మూడు కోతులను వేటాడి వాటి మాంసాన్ని వండుకుంటున్నట్లు గుర్తించిన అధికారులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వీరిలో ఒకరు పట్టుబడగా మరో ఇద్దరు అటవీ శాఖ అధికారుల రాకను గమనించి అక్కడి నుంచి పారిపోయారు. అధికారులకు దొరికిపోయిన నిందితుడు తెలంగపదర్‌ పంచాయతీలోని పత్రాని గ్రామానికి చెందిన విశ్వనాథ్‌ డాకప్రస్కాగా గుర్తించారు. అతడిని విచారించగా అడవిలో ఉన్న కోతులను వేటాడి వాటిని చంపి వాటి మాంసాన్ని వండుకుంటున్నట్లు అంగీకరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement