ఎలుగుబంటితో పోరాడి.. ప్రాణాలు కాపాడుకుని | - | Sakshi
Sakshi News home page

ఎలుగుబంటితో పోరాడి.. ప్రాణాలు కాపాడుకుని

Oct 23 2026 1:39 AM | Updated on Oct 23 2026 1:39 AM

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి సమితి పోట్రేల్‌ పంచాయతీ ఇందిరా కాలనీకి చెందిన సదా పంగి (45) అనే వ్యక్తి గురువారం ఉదయం కట్టెల కోసం అడవికి వెళ్లాడు. కట్టెలు కొడుతుండగా తల్లి ఎలుగు బంటితో పాటు పిల్ల ఎలుగుబంటి రెండు అకస్మాత్తుగా అతనిపై దాడి చేశాయి. అతను ధైర్యం కోల్పోకుండా వాటితో పోరాడాడు. ఆఖరుకు ఎలుగు తన పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. ఒంటి నిండా గాయాలతో అతడు అతి కష్టం మీద ఇంటికి చేరుకున్నాడు. అంగన్‌వాడీ కార్యకర్త వెంటనే అంబులెన్స్‌ను పిలిచి కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ వైద్యులు మల్కన్‌గిరి తరలించారు.

చెరువులో పడి వృద్ధుడు మృతి

జయపురం: జయపురం సబ్‌ డివిజన్‌ బొయిపరిగుడ సమితి చికాపూర్‌ గ్రామ పంచాయతీ చికాపూర్‌ గ్రామ సమీపంలోని చెరువులో ఒక వృద్ధుడి మృతదేహం గురువారం కనిపించింది. ఆ మృతదేహం గ్రామానికి చెందిన దిను మండీ(72) అనే వృద్ధుడిదిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే బొయిపరిగుడ పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కమ్యూనిటీ హాస్పిటల్‌కు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. దిను మండీ మంగళవారం ఉదయం సమయంలో బహిర్భూమికి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించినా తెలియలేదు. కాగా గురువారం ఉదయం గ్రామస్తులు చెరువు వైపు నుంచి వెళ్తుండగా మృతదేహం తేలుతూ ఉండడం కనిపించింది. మృతుని కుమారుడు శుక్రు మండీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆసియా పారా గేమ్స్‌ 2026లో రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభ

భువనేశ్వర్‌: జపాన్‌లోని ఐచి నగోయాలో జరుగుతున్న 5వ ఆసియా పారా గేమ్స్‌ 2026లో రాష్ట్ర క్రీడాకారులు ప్రతిభ ప్రదర్శించి పతకాలు సాధించారు. ప్రముఖ పారా షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌, మనీషా రామదాస్‌తో కలిసి ఆసియా క్రీడలు మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారు. ఈ క్రీడల్లో ఒడిశా పారా అథ్లెట్‌ జయంతి బెహెరా మహిళల 400 మీటర్ల టి – 47 విభాగంలో రజత పతకం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement