చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్‌ మృతి

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

పర్లాకిమిడి: రాయఘడ బ్లాక్‌ నారాయణపూర్‌ పంచాయతీ బడగాం గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (ఆటోను టిప్పర్‌ ఢీకొంది) క్షతగాత్రుడు పి.కుమార్‌ (35) శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మృతిచెందిన పి.కుమార్‌ ఆటో డ్రైవర్‌, చిరువ్యాపారి గుసాని సమితి నరహారిపురం గ్రామానికి చెందినవాడు. మృతుడి భార్య ఆరు నెలల గర్భవతిగా అని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన క్షతగాత్రుల కుటుంబాలకు టిప్పర్‌ యజమాని, ప్రభుత్వం న్యాయం చేయాలని బడగాం గ్రామస్తులు కోరుతున్నారు.

శ్రమదానం..

పర్లాకిమిడి: పరిశుభ్రత, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ చేయాలని స్థానిక సామాజిక సేవకుడు, రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి మనోజ్‌ దాస్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పిలుపుమేరకు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయిన డోలా ట్యాంకును శ్రమదానం చేసి క్లీన్‌ చేశారు. బుధవారం ఉదయం పట్టణంలో గల డోలా ట్యాంకును కొంతమంది యువకలు సంతోష్‌ గంతాయత్‌, లోకనాథ మిశ్రా, ప్రతాప్‌ మిశాల్‌, వై.మురళీధర్‌, గోవింద రాజు తదితరులు ట్యాంకులో ఉన్న చెత్తను తొలగించారు. డోలా ట్యాంకు నలువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement