రాయగడ: ఝార్సుగుడ జిల్లా రెంగాలి పోలీసులు నిర్వహించిన దాడిలో అంతరాష్ట్ర జూద కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. కనక్తొరా సమీపంలో బడిమాల్ అటవీ ప్రాంతంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఛత్తీస్‌ఘడ్‌లోని రాయఘడ్ జిల్లాకు చెందిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రూ.1,00,260ల నగదు, ఐదు ద్విచక్ర వాహనాలు, ఏడు సెల్‌ఫోన్లు, నాలుగు సెట్ల ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై రెంగాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఝార్సుగుడ ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర తెలిపారు.


