భక్తుల సేవలో వాలంటీర్లు | - | Sakshi
Sakshi News home page

భక్తుల సేవలో వాలంటీర్లు

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

పూరీలో సెయింట్‌ జాన్‌ అంబులెన్స్‌ వాలంటీర్ల సేవలకు ఆమెదం

భువనేశ్వర్‌: పూరీ జగన్నాథుని దేవస్థానం శ్రీమందిరానికి నిత్యం వస్తున్న భక్తులు, యాత్రికుల సేవల్లో సెయింట్‌ జాన్‌ అంబులెన్స్‌ వాలంటీర్ల సేవలకు రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి ఆమోదం తెలిపారు. స్థానిక లోక్‌ భవన్‌ న్యూ అభిషేక్‌ హాల్‌లోని జరిగిన ఒడిశా రాష్ట్ర కేంద్ర సెయింట్‌ జాన్‌ అంబులెన్స్‌ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు. ఆలయంలో వృద్ధులు, దివ్యాంగులకు నిరంతరాయ సులభ దర్శనం కల్పించేందుకు సెయింట్‌ జాన్‌ అంబులెన్స్‌ వాలంటీర్లను వినియోగించుకోవాలని యోచిస్తున్నట్లు సమావేశంలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తూ వాలంటీర్లు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు వారికి సరైన శిక్షణ, ఆధునిక నైపుణ్యత కల్పించడం అవసరమని పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్ర కేంద్ర సెయింట్‌ జాన్‌ అంబులెన్స్‌ కార్యదర్శి గణేష్‌ చంద్ర పాత్రో, అగ్నిమాపక సేవల డైరెక్టర్‌ జనరల్‌ సుధాంశు షడంగి, అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అరబింద కుమార్‌ పాఽఢి, రవాణా కమిషనర్‌ కమ్‌ రాష్ట్ర రవాణా అథారిటీ (ఎస్‌టీఏ) చైర్మన్‌ అమితాబ్‌ ఠాకూర్‌, ఓపీహెచ్‌డబ్ల్యూసీ సీఎండీ కమ్‌ డైరెక్టర్‌ సౌమేంద్ర ప్రియదర్శి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ప్రభుత్వ కమిషనర్‌ కమ్‌ కార్యదర్శి అశ్వతి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement