కొరాపుట్: వరదల వలన నష్టపోయిన బాలలను ఆదుకోవడానికి యువత ముందుకు వచ్చింది. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రానికి సమీపంలో నందాహండి సమితి సన్న డయబెటా, బోడ డయబెటా గ్రామాల్లో 400 మంది బాలలకు సహాయ సహకారాలు అందించారు. పట్టణానికి చెందిన సంజీవని యూత్ గ్రూప్ ఆధ్వర్యంలో 2 నుంచి 5 ఏళ్లలోపు బాలలకు దుస్తులు, చెప్పులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నందాహండి బీడీవో క్షీరోద్ చంద్ర సాహు, అధికారులు ప్రకాష్ మిశ్ర, చంద్ర దాస్ మహానందియా, సంజీవని సంస్థకి చెందిన విక్రం దాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం
పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ అనుబంధ విద్యాసంస్థ సెంచూరియన్ పబ్లిక్ స్కూల్‌లో ప్రపంచ ర్యాబిస్ దినోత్సవాన్ని మంగళవారం జిల్లా పశువైద్య ఆస్పత్రి వెటర్నరీ సర్జన్ డా.బి.సాయి సందీప్ ప్రారంభించారు. కార్యక్రమంలో సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ డా.అనితాపాత్రో, పర్లాకిమిడి పురపాలక శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం.ధనేశ్వరరావు, వెటర్నరీ స్కూల్, యానిమల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. రేబిస్ వ్యాధి నివారణ, టీకాల ప్రాధాన్యత, జంతువులపై బాధ్యతాయుతమైన సంరక్షణపై విద్యార్థుల్లో కల్పించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డా.సాయి సందీప్ తెలిపారు. పెంపుడు జంతువులను బాధ్యతాయుతంగా సంరక్షించడం, రేబిస్ టీకాలు సకాలంలో వేయించడం యాజమానుల ముఖ్య బాధ్యత అని డా.ఎస్.ఎన్.సంధ్య అన్నారు.


