అక్టోబర్‌ 1 నుంచి బైసైక్లింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 1 నుంచి బైసైక్లింగ్‌ పోటీలు

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

మాతృభాషలోనే మందుల చీటి..!

–8లోu

ఒడిశాలోని కొరాపుట్‌కు చెందిన ఒక ప్రభుత్వ వైద్యుడు రోగులకు సులభంగా అర్థమయ్యేలా మాతృభాషలోనే మందుల పేర్లను సూచిస్తున్నారు.

పర్లాకిమిడి: ఒడిశా సైక్లింగ్‌ అసోసియేషన్‌, సైక్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో 23వ జాతీయ స్థాయి పర్వత శిఖర బైసైక్లింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలను అక్టోబర్‌ 1వ తేదీ నుంచి 4 వరకు మహేంద్రగిరి వద్ద నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ అక్షయ సునీల్‌ అగర్వాల్‌ తెలియజేశారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆసక్తి ఉన్న యువతకు ఇదొక మంచి అవకాశమని, పాల్గొన్న ప్రతివారికి షెల్టర్‌, ఆహారం ఉచితంగా అందించబడుతుందని తెలిపారు. మహేంద్రగిరి ప్రకృతి సౌందర్యం, పర్యటన, క్రీడాపోటీలు విస్తరించడానికి ఒడిశా సైక్లింగ్‌ అసోసియేషన్‌ పోటీలను నిర్వహిస్తోందన్నారు. సమావేశంలో ఒడిశా సైక్లింగ్‌ అసోసియేషన్‌ సాధారణ కార్యదర్శి ప్రసన్న కుమార్‌ రవుత్‌, సీఎఫ్‌ఐ కార్యదర్శి శైలేంద్ర పాఠక్‌, సీఎఫ్‌ఐ అధికారి ప్రద్యుమ్న కుమార్‌ బిశోయి, జిల్లా క్రీడాశాఖ అధికారి త్రినాథ సాహు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement