గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఈడీఐఐ)లో ఈనెల 21 నుంచి 26వ తేదీల వరకు నిర్వహించిన పారిశ్రామికవేత్తల అభివృద్ధిని ప్రోత్సహించే ఫ్యాకల్టీ మెంటార్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయం తరపున వృక్షశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, పీజీ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో, వర్సిటీ భౌతికశాస్త్ర విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ జ్ఞాన రంజన్ మహంతిలు పాల్గొన్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనిలో భాగంగా విద్యార్థుల్లో ఉన్న పారిశ్రామికవేత్తల లక్షణాలు, ప్రతిభను గుర్తించడం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే వ్యక్తిగా మార్చటం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. – జయపురం


